శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి :-డీఎస్పీ గంటా గిరిబాబు

దేవరకొండ సెప్టెంబర్ 19 జనవరి సాక్షి :

గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని గణేష్ మండపాల ఏర్పాటు నిర్వాహకులు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని దేవరకొండ డిఎస్పి గంటా గిరిబాబు సూచించారు. మంగళవారం స్థానిక మున్సిపాలిటీలో పోలీస్,రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ మున్సిపాల్ శాఖల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ మరియూ అన్ని మతాల మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాక్యలు ఎవరు చేసినా, సోషల్ మీడియాలో పుకార్లు సృష్టించినా, అసత్య ప్రచార సందేశాలు పంపిన సోషల్ మీడియా పై ప్రత్యేకంగా నిఘా ఉంటుందన్నారు.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించమని హెచ్చరించారు.
అసాంఘిక శక్తుల పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ అలంపల్లి నరసింహ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్టు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.
గణేష్ మండపాలలో తొమ్మిది రోజులపాటు విద్యుత్ సరఫరా కోసం సంబంధిత విద్య శాఖ ద్వారా అనుమతులు తీసుకుని విద్యుత్ అధికారుల సూచనలు పాటిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని దేవరకొండ ఆర్టిఓ శ్రీరాములు సూచించారు. వినాయక మండపాల వద్ద శబ్ద కాలుష్యం లేకుండా ఉండే విధంగా కేవలం స్పీకర్లను వాడాలని లౌడ్ స్పీకర్లను, డీజేలను ఎట్టి పరిస్థితులలో ఉపయోగించకూడదన్నారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు పెట్రోలింగ్ నిర్వహిస్తామని దేవరకొండ సీఐ నాగభూషన్ రావు అన్నారు. అన్ని విధాలుగా సమన్వయం చేస్తూ ప్రజానీకానికి ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని,
వినాయక చవితి ఉత్సవాలలో నిర్వాహకులు భక్తిరసమైన పాటలను మాత్రమే పెట్టాలని, అలా కాకుండా సినిమా మాటలు పెట్టి పవిత్రతను దెబ్బతీయరాదనీ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. ఇట్టి కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మార్వో సంతోష్ కిరణ్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నీలా రవికుమార్,నక్క వెంకటేశ్వర్లు అడ్వకేట్ వనం జగదీశ్వర్, కౌన్సిలర్లు రయీస్, పొన్నబోయిన సైదులు, జయప్రకాష్, గాజుల మురళి,
దేవరకొండ మక్కా మసీద్ అండ్ ఈద్గా కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అజీముద్దిన్ ,యూత్ నాయకులు అప్రోజ్, బురాన్, సలీం, ఖదీర్,
ఖాజా మొయినుద్దీన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు,