ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి

ఎమ్మార్పీఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ మంథని చందు మాదిగ
జనంసాక్షి , మంథని : ఈ పార్లమెంటు సమావేశాల్లోని ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ మంథని చందు మాదిగ డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రధానమంత్రికి లేఖలు రాసి తమ చిత్త శుద్దిని నిరూపించుకోవాలన్నారు. మంథనిలో చేపట్టిన 9వ రోజు రిలే నిరాహార దిక్షలో మంగళవారం మంథని చందు మాదిగ తో పాటు మంథని మండల్ కన్వీనర్ పొట్ల రమేష్ మాదిగ, మంథని మండల్ అధికారప్రదినిది మంథని లింగయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.