ఈ నెల 25న మంథని తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ
– పాల్గొననున్న జిల్లా కలెక్టర్
జనంసాక్షి, మంథని : ఈ నెల 25న సోమవారం జిల్లా కలెక్టరేట్ తో పాటు మంథని తహసిల్దార్ కార్యాలయంలో రెండు చోట్ల ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు, మంథని డివిజన్ సంబంధించి మంథని తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొంటున్నట్లు తెలిపారు.
ప్రజలు జిల్లా కేంద్రంలో, మంథని డివిజన్ కేంద్రంలో డివిజన్ లోని సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు తెలుపుతూ అర్జీలను సమర్పించవచ్చు అని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లా అధికారులు కలెక్టరేట్ లో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో, మంథని డివిజన్ అధికారులు డివిజన్ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉండే విధంగా సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.