మహిళా బిల్లు పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మోర్చా రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు గుగులోత్ దేవిక నాయక్
-ప్రధాన మంత్రి నరేంద్రమోడి చిత్రపటానికి పాలాభిషేకం
డోర్నకల్,సెప్టెంబర్-19,జనం సాక్షి న్యూస్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ లో మహిళా బిల్లు ను ఆమోదించటo పై బిజెపి మోర్చా రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు, డోర్నకల్ మాజీ జెడ్పిటిసి గుగులోత్ దేవిక నాయక్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయ ఆవరణలో మహిళల బిల్లుపై సంతోషం వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బిజెపి మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు, మాజీ జెడ్పిటిసి గుగులోత్ దేవిక నాయక్ మాట్లాడుతూ చారిత్రకమైన నిర్ణయాలను నరేంద్ర మోడీ తీసుకుంటారని ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని ఆశాభావం ఉండేదని అది మోడీ సార్ధకం చేశారని ఆమె పేర్కొన్నారు. రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న బిల్లు మోడీ హయాంలోనే సాధ్యమైందని ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని మహిళా సాధికారిక సాధ్యమవుతుందని మహిళా బిల్లు ఆమోదం పొందటం దేశానికే గర్వకారణం అని ఈ బిల్లుకు మోడీ నారిశక్తి అని నామకరణం చేయటం సంతోషమని డోర్నకల్ నియోజవర్గ మహిళలందరూ తరఫున కృతజ్ఞతలు తెలియ జేశారు. బిల్లును లోకసభ లో అన్ని పార్టీలు మద్దతు తెలిపాలని ఆమె కోరారు. అనంతరం కార్యకర్తలు మహిళలకు స్వీట్లు పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షుడు బాసాని నాగేష్, డోర్నకల్ టౌన్ అధ్యక్షుడు దివ్సింగ్ నాయక్,వివిధ మండలాల అధ్యక్షులు జోగి వెంకటేష్, లింగం, బింకీ రమేష్, లింగ, వెంకట్ రెడ్డి, డోర్నకల్ టౌన్ కార్యదర్శి జయరాజ్,మండల గిరిజన యువమోర్చా బానోతు లాల్ సింగ్,ఉపేందర్, బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.