వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ దర్పన్ అవగాహన

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ దర్పన్ అవగాహన

చెన్నూర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి); కిష్టంపేట రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ ఆధ్వర్యంలో రైతు లకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది.
(IIIT ) ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
రూపొందించిన క్రాప్ దర్పణ్ app
రైతులకు వ్యవసాయ సంబంధిత వివరాలు తెలుగులో తెలుసుకునుటకు ఉపయోగపడుతుంది అని,
ప్రస్తుతం పత్తి మరియు వరి పంటలలో వచ్చే చీడపీడలు మరియు పోషక లోపాలు సులువుగా గుర్తించుటకు వీలుగా ఈ యాప్ రూపొందించబడింది.
త్వరలో మిగిలిన పంటలు వివరాలు కూడాఅందుబాటులో ఉంటాయి అన్నారు.పంటలో వచ్చిన వ్యాధి లక్షణాలు లేదా పురుగుల యొక్క లక్షణాలు ఆధారంగా వ్యాధి పేరు మరియు నివారణ చర్యలు తెలుగులో చూపిస్తుంది.తద్వారా రైతులు నియంత్రిత మోతాదులో
రసాయనాలు పిచికారి చేయవచ్చని వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ వివరించారు.
అదే విధంగా
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన శాఖ మొక్కల పెంపకంపై అవగాహన
కల్పించడం జరిగింది.
ఆయిల్ పామ్ సాగు గురించి
వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.