25కాసుల బంగారం అపహరణ

విజయవాడ: భవానీపురంలో ఓ ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన దొంగతనం కలకలం సృష్టించింది. రాత్రి మహిళలు ఒంటరిగా ఉన్న ఇంట్లోకి ప్రవేశించి 25కాసుల బంగారం, 3వేలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నగరంలో హోల్‌సేల్‌ బెల్లం వ్యాపారం చేసే సాంబశివరావు, అతని భార్య సుజాత మెడలోని బంగారంతో పాటు ఇంట్లోని గాజులెత్తుకెళ్లారు. బాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు