30 కిలోల పేలుడు పదార్థాలు…. 5 రోజుల రెక్కీ ….

వెరసి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి
ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో 27 నుంచి 30 కిలోల వరకూ పేలుడు పదార్థాలు వాడినట్లు ఫోరెన్సిక్‌ విభాగపు ప్రాథమిక నివేదిక పేర్కొంటోంది. అందులో అధిక భాగం అమ్మోనియం నైట్రేట్‌ అని తెలుస్తోంది. మందుపాతరను పేల్చడానికి ఎలక్ట్రిక్‌ డిటొనేటర్లను వాడారని, 200 మీటర్ల వైరును వినియోగించారని ఈ నివేదిక పేర్కొంది. దాడికి ఐదురోజుల ముందునుంచి ఆ ప్రాంతంలో 40 నుంచి 50 మందిదాకా మావోయిస్టులు మాటు వేసివున్నారని, అయినా కనిపెట్టలేకపోవడం భద్రతా విభాగవైపల్యమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడి ఘటనపై ఎస్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. మావోయిస్టు దాడి ఘటనను ఎస్‌ఐఏ దర్యాప్తు చేయడం ఇదే ప్రథమం.