370 రద్దుతో దీర్ఘకాలిక ప్రయోజనాలు మిన్న

రానున్న కాలంలో పారిశ్రామికంగా అభివృద్ది
పెరగనున్న కాశ్మీర్‌ పర్యటకం
న్యూఢిల్లీ,ఆగస్ట్‌6  (జనం సాక్షి) :  కాశ్మీర్‌లో ఈ 370 అధికరణం రద్దు వల్ల తక్షణ ప్రయోజనాల కంటే దీర్ఘకాల ప్రయోజనాలే ఎక్కువ. ప్రధానంగా పారిశ్రామికంగా కాశ్మీర్‌ బాగా అభివృద్ది చెందగలదు. అలాగే పర్యాటకం మరింతగా వికసించే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచపర్యాటకలు స్వేచ్చగా రాగలగుతారు. ప్రకృతి అందాలకు నెలవైన కాశ్మీర్‌లో పర్యాటకంగా బాగా వృద్ది చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇతర దేశాల్లో లేని అనేక ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని సందర్శించాలన్న ఉత్సుకత పర్యాటకల్లో ఉంది. ఇంతకాలం ఉగ్రచర్యల కారణంగా అక్కడ అవకాశాలు తగ్గాయి. తాజా చర్యల కారణంగా  స్థానిక ప్రజలు బాగా లబ్ది పొందుతారు.అలాగే 370పై  రాజకీయ ఉద్వేగమే ప్రధానమైంది. ఈ ఉద్వేగ బంధాన్ని తగ్గించటం విూద కశ్మీర్‌లో భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కశ్మీరేతరులు 370 రద్దును సాహసోపేత చర్యగానే భావించ వచ్చు. కశ్మీర్‌ ప్రజలు తమకు స్వయంప్రతిపత్తి, ప్రత్యేక¬దా ఉందనుకుంటే అది లేకుండా పోయిందన్న బాధలో ఉంటారు. తీవ్రవాదుల దుశ్చర్యలతో భద్రతాదళాలు, పౌరులు ప్రాణాలు కోల్పోవటం, పన్ను రూపంలో తాము చెల్లించిన వేలకోట్ల రూపాయలను కశ్మీర్‌లోనే ఖర్చుపెట్టాల్సి రావటం వంటివి దేశ ప్రజల్లో కశ్మీర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే భావనలకు కారణమైనాయి. 370 అధికరణం రద్దుపై  కాంగ్రెస్‌ తదితర రాజకీయపార్టీలు ఏకాభిప్రాయం ప్రకటించకుండా రాజకీయం చేయడం అన్నది చరిత్ర క్షమించదు. కశ్మీర్‌ విలీనం, అధికరణ 370ని రాజ్యాంగంలో చేర్చటం, రాష్టాన్రికి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు లాంటి కీలక పరిణామాలన్నీ గతంలో చాలా వరకూ ఏకాభిప్రాయం మేరకే జరిగాయి. అయితే, పాక్‌ ప్రేరిపిత గిరిజన దాడులతో గత్యంతరం లేని పరిస్థితుల్లో జమ్మూ-కశ్మీర్‌ని భారత్‌లో విలీనానికి నాటి మహారాజు అంగీకరించారు. 370 అధికరణం రద్దుకోసం జనసంఘ్‌ రోజుల నుంచి బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. జమ్మూ-కశ్మీర్‌ని మూడు భాగాలుగా విడగొట్టాలన్న వాదన కూడా ఎన్నోసార్లు వినిపించింది. అందుకే తాజా నిర్ణయం  అసాధారణంగా చూడాలి.  సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యసభ వాటికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు తదితర పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలు అధికార భాజపా, ఆ పార్టీ మద్దతుదారుల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపాయి. సహజంగానే జమ్మూ-కశ్మీర్‌లో ప్రధాన రాజకీయ పార్టీలైన పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాష్ట్రంలో అగ్ర నాయకులను ఆదివారం అర్ధరాత్రి గృహ నిర్బంధంలో ఉంచిన ప్రభుత్వం సోమవారం రాత్రి వారిని అరెస్టు చేసింది. 370పై తాజా నిర్ణయం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ప్రపంచం మొత్తానికీ తెలిసినప్పటికీ జమ్మూకశ్మీర్‌ ప్రజల్లో ఎక్కువ మందికి ఈ వార్త చెవినపడలేదు. మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడమే ఇందుకు కారణం. అయితే ఇకనుంచి కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుంది.