4న‌ న మాత్ర‌మే మంచినీటి సరఫరా ఉండదు

కృష్ణా మూడోదశ పనుల కారణంగా హైదరాబాద్ కు ఇవాళ మంచినీటి సరఫరా నిలిపివేశారు. హైదరాబాద్ కు 24 గంటలపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 3 రోజులపాటు హైదరాబాద్ లో మంచినీటి సరఫరా ఉండదని జరుగుతున్న ప్రచారం సరైంది కాదని జలమండలి అధికారులు పేర్కొన్నారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్ కు మంచినీటిని తరలించే పైపులైన్ లింకేజీ పనుల వల్ల ఒకరోజు మాత్రమే నీటి సరఫరా నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు.