60 రూపాయలకు చేరిన డాలర్‌ ధర

ముంబై,(జనంసాక్షి): రూపాయి పతనం ఆగడం లేదు. 11 నెలల తర్వాత మళ్లీ 59.61 పైసలకు రూపాయి పతనం అయ్యి జీవిత కాలపు కనిష్ట స్థాయికి చేరింది. 2012 జూన్‌28న 57 ను తాకిన తరువాత మళ్లీ ఈ నెల జూన్‌ 11న 58.98 పైపల కనిష్ట స్థాయికి దిగజారింది. డాలర్లకు విపరీతంగా డిమాండ్‌ వస్తుండటంతో రూపాయి కుంగిపోతోంది. సెంటిమెంట్‌ తీవ్రంగా ప్రతికూలంగా ఉండటంతో ఏ దశలోనూ కోలుకునే సూచన రావడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ వారంలో రూపాయి 60ని తాకేలా విశ్లేషకులు చెపుతున్నారు.
ఇప్పటికే రూపాయి ఒక్క నెలలో దాదాపు ఐదురూపాయల దాకా పతనం అయ్యింది. రూపాయి పతనం వల్ల పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, ఇతర దిగుమతి వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదముంది. ధరలు పెరుగుతాయి కాబట్టి వడ్డీరేట్లు కూడా తగ్గవు. ఐటీ ,ఫార్మా లాంటి ఒకటి రెండు రంగాలకు తప్పిస్తే మిగిలిన అన్ని రంగాలకు రూపాయి పతనం వల్ల పష్టం కలుగుతుంది.