ఢిల్లీలో జరిగిన అత్యాచారం కేసులో నేడు తొలి తీర్పు

ఢిల్లీ : ఢిల్లీలో గత డిసెంబరులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన కేసులో తొలి తీర్పు ఈరోజు వెలువడనున్నట్లు సమాచారం. అరుగురు నిందితుల్లో ఒకరు బాల నేరస్థుడు (17 ఏళ్లు) కావడంతో అతడి విచారణ విడిగాసాగింది. నేరస్థుడికి ఏం శిక్ష వేయాలనేది జువెనైల్‌ జస్టిన్‌ బోర్డు నిర్ణయిస్తుంది. అతనికి అత్యధికంగా మూడేళ్ల శిక్ష పడవచ్చు. అయితే జరిగిన నేరసంఘటనలో అతనే అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యలో అతనికి తక్కువ శిక్ష పడితే మళ్లీ ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు అతడిని బాలుడిగా కాక సాధారణ నేరస్థుడిగా పరగణించి శిక్షించాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.