కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గురువారం మొదటి దశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ మిడ్నాపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 11మంది కార్యకర్తలు గాయపడ్డారు. మిడ్నాపూర్‌లోని మరో పోలింగ్‌ బూత్‌ వద్ద సీపీఎం నాయకుడు సూర్యకాంత మిశ్రా తన ఓటు వేసిన అనంతరం బయట తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నికల తేదీలను వాయిదా వేయమని కోరగా సుప్రీంకోర్టు గత వారం నిరాకరించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో పశ్చిమ మిడ్నాపూర్‌, పురులియా, బన్కురా మూడు జిల్లాలలో 10,200 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 75 లక్షల ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.