మిశ్రమంగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. యూరోప్‌ మార్కెట్లలో జరమనీ సూచీ ఒక శాతానికి పైగా పెరిగింది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌ సూచీలు అర శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. సింగపూర్‌. హాంకాంగ్‌, దక్షిణ కొరియా, షాంఘై సూచీలు అర శాతం దాకా నష్టపోతున్నాయి. జపాన్‌ సూచీ లాభాల్లో ఉంది.
సింగపూర్‌ నిఫ్టీ 30 పియింట్ల దాకా లాభపడుతూ 5,970కి సమీపంలో ట్రేడవుతుంది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ 107.5 డాలర్లకు సమీపంలో ట్రేడవుతుంది. ఔన్స్‌ గోల్డ్‌ ధర 1285 డాలర్లకు సమీపంలో కొనసాగుతుంది. గత రాత్రి ఎంసీక్స్‌ లో 10గ్రాముల ధర 564 రూపాయలు పెరిగి 26,667 వద్ద ముగిసింది. కేజీ వెండి ధర 1526 రూపాయలు పెరిగి 41,700 ల వద్ద ముగిసింది.