విద్యార్థులతో మాట్లాడుతున్న నరేంద్ర మోడీ

పుణె: ఫర్గ్యుసస్‌ కళాశాల విద్యార్థులతో నరేంద్రమోడీ ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ…. దేశానికి ఏదైనా మేలు చేయాలన్న తపన యువతలో ఉందన్నారు. విశ్వవిద్యాలయాలు డబ్బులు సంపాదించే యాత్రాలుగా మారాయని అవేదన వ్యక్తం చేశారు. ఐటీరంగంలో యువత ప్రతిభ కనబర్చడం వల్లే భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తక్కువ కాలంలో అభివృద్ధి చెంది…..ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించి దక్షిణ కొరియా సత్తా చాటిందన్నారు. కామన్వెల్త్‌ క్రీడలు కూడా మనం సక్రమంగా నిర్వహించలేకపోయామని అసహనం వ్యక్తం చేశారు. చైనాలా భవిష్యత్‌పై మనకు స్పష్టమైన మార్గసూచీ లేదని, చైనా జీడీపీలో 20శాతం నిధులను విద్యకు కేటాయిస్తే…. మనం కేటాయించింది కేవలం 4శాతమేనని విమర్శించారు. సావర్కర్‌ చదివిన కళాశాలలో ప్రసంగించడం తనకు గర్వంగా ఉందని మోడీ అన్నారు.