ప్రారంభమైన వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు

ఢిల్లీ: వంశధారపై ట్రైబ్యునల్‌లో వాదనలు ప్రారంభమయ్యాయి. 1962 ఒప్పందం ప్రకారం నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా కావాలనే అడ్డంకులు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయవాది తన వాదనలు వినిపించారు. 106 ఎకరాల భూమిని ఒడిశా అప్పగించకుండా బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకుంటుందని అరోపించారు. వంశధార జలాలను తాత్కాలికంగా వాడుకునేందుకు ఒడిశా అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్‌ ట్రైబ్యునల్‌ దృష్టకి తెచ్చింది. ట్రైబ్యునల్‌లో మరో రెండు రోజుల పాటు వాదనలు కొనసాగనున్నాయి.