నీట్‌ నోటిఫికేషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ: నీట్‌ నోటిఫికేషన్‌ను గురువారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు నీట్‌ రద్దు చేయాలని తీర్పునిచ్చారు. నీట్‌ నిర్వహించే అధికారం ఎంసీఐకు లేదని న్యాస్థానం తేల్చిచెప్పింది. రాష్ట్రాలు వైద్య విద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర విద్యార్థులకు వూరట లభించింది. దీంతో వైద్య విద్య కళాశాలల్లో పాతపద్ధతిలోనే ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించుకునే వెసులుబాటు లభించింది.