టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
హరారే,(జనంసాక్షి): జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలిమ్యాచ్ బుధవారం హరారేలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు, లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ తొలిసారిగా భారత జట్టు తరుపున ఆడబోతున్నారు.