రాజీనామా చేస్తామని చెప్పలేదు: శైలజానాథ్
అనంతపురం: సమైక్యవాదాన్ని మరోసారి బలంగా వినిపించేందుకే ఢిల్లీ పర్యటన చేపట్టినట్లు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ తెలిపారు. మంత్రులెవరూ రాజీనామా చేస్తామని చెప్పలేదని, కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉంటామని మాత్రమే అన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఢిల్లీ స్థాయిలో ఎంపీలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.