ఏపీ భవన్‌లో ముగిసిన భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర నేతలు మరోసారి తీర్మానం చేశారు. కేంద్రమంత్రులు, ఎంపీలకు ఇదే విషయాన్ని తెలియజేశామని, రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మంత్రి శైలజానాథ్ చెప్పారు.