తెలంగాణ ఇస్తున్నట్లు బొత్సకు సంకేతాలిచ్చిన సీఎం కిరణ్
న్యూడిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపే కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం సీఎం, పీసీసీ చీఫ్‌కు సంకేతాలిచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో వరుస భేటీలు జరిపిన దిగ్విజయ్ సింగ్, ఆజాద్ రాష్ట్ర ఏర్పాటు తప్పదని సీఎం, బొత్సకు సూచనప్రాయంగా తెలుస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్దంగా ఉండాలని వారిని ఆదేశించినట్లు సమాచారం. వార్‌రూమ్‌లో సీఎంతో 45 నిమిషాలు, బొత్సతో 30 నిమిషాల పాటు దిగ్విజయ్, ఆజాద్ చర్చలు జరిపారు. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం ఉంటుందని బొత్స చెప్పిన విషయం తెలిసిందే.