నిమ్స్‌ డైరెక్టర్‌గా తెలంగాణ వ్యక్తిని నియమించాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనసంసాక్షి): నిమ్స్‌ డైరెక్టర్‌గా తెలంగాణ వారినే నియమించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. మరోసారి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లా వాసిని నియమించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర రాష్ట్రం ఇందుకోసమేనా అని సీఎంను హరీష్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలోనేనా న్యాయబద్దంగా వారిని నియమించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత 30 ఏళ్లలో ఇప్పటి వరకు నియమించిన 14 మంది డైరెక్టర్లలో ఒకరు మాత్రమే తెలంగాణవారు అని తెలిపారు. అది కేవలం ఒక సంవత్సరం మాత్రమే పదవిలో కొనసాగారు అని గుర్తు చేశారు. ఇదా వివక్ష కాదా అని ప్రశ్నించారు.