శ్రీశైలంలో హుండీ లెక్కింపు
శ్రీశైలం : శ్రీశైలంలోని భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు ఈ రోజు జరిగింది. ఈ లెక్కింపులో ఒక కోటి 44 లక్షల 54 వేల 960 రూపాయల నగదు వచ్చినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. నగదు తోపాటు పలు విదేశీ కరెన్సీని కూడా భక్తులు స్వామివార్లకు కానుకలుగా సమర్పించారు ఈ ఆదాయం 28 రోజుల్లో సమకూరిందని ఆయన తెలిపారు.