భారతీయ సంస్కృతిని యువత కాపాడాలి : లక్ష్మీనారాయణ
హైదరాబాద్ : భారతదేశ పూర్వ వైభవాన్ని ప్రపంచానికి చాటే సత్తా యువతలోనే ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.ఖమ్మం సీక్వెల్ ఫంక్షన్‌హాల్‌లో లయన్స్ ఇంటర్నేషనల్ ,,రెజోనెన్స్ విద్యాసంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యువ నిర్మాణ కార్యక్రమానికి లక్ష్మినారాయణ ముఖ్యఅథితిగా హాజరయ్యారు.భారతదేశ సంస్కృతి ,సాంప్రదాయాలు ఎంతో ఘనమైనవని ,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు.పాఠ్యపుస్తకాలతో పాటు జీవితాన్ని నేర్పే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.