విషతుల్యమైన ఆహారం తిని ముగ్గురి మృతి
బరంపురం: విషతుల్యమైన ఆహారాన్ని తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఒడిశాలోని బరంపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దబజారు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతబరంపురం పొందరవీధికి చెందిన భుబునిపాడి(65) కుటుంబసభ్యులు నిన్న రాత్రి భోజనం చేశారు. అనంతరం ముగ్గురు కుమారులు ప్రమోద్‌పాడి(35), పంకజ్‌పాడి(22), ప్రసన్నపాడి(25) పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఎంకేసీజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కుటుంబంలో ఉన్న మొత్తం ఏడుగురి సభ్యుల్లో భుబునిపాడి భార్య, పెద్ద కుమారుడు మినహా ఐదుగురు నిన్న రాత్రి భోజనం చేశారు.