కీలకమైన అవరోధాన్ని అధిగమించాం
ఇంకో రెండు మెట్లెక్కాలి
అప్పటి వరకూ తెలంగాణ సమాజం అప్రమత్తంగా, ఐక్యంగుండాలి
‘జనంసాక్షి’తో కోదండరామ్
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలకమైన అవరోధాన్ని అధిగమించామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇంకో రెండు మెట్లెక్కాల్సి ఉందని, తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ తన అభిప్రాయాన్ని వెల్లడించడం, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందడం ఇప్పుడు అత్యంత కీలకమైనదని అన్నారు. అప్పటి వరకూ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఐక్యంగుండాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర నిర్ణయం హర్షణీయమని చెప్పారు.