కన్నుల పండువగా పద్మావతి అమ్మవారి రథోత్సవం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూెత్సవాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. దివ్య అలంకార శోభితురాలైన శ్రీ పద్మావతీ దేవి బ్రహ్మతథంపై కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగారు. రథం లాగేందుకు వచ్చిన భక్తులతో తిరుచానూరు కిటకిటలాడింది. అంతకు ముందు వేకువజామునే అమ్మవారికి ఏకాంతంగా సుప్రభాతం, అర్చన మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. 5 గంటలకే అమ్మవారిని వేంచేపుగా రథమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఉదయం 7.15 వృత్తిక లగ్నంలో రథోత్సవం వేడుకగా ప్రారంభమై రెండు గంటల పాటు జరిగింది. ఈ రోజు రాత్రి అమ్మవారు కల్కీ అవతారంలో అశ్వవాహనంపై ఊరేగుతారు.