అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
ఢిల్లీ: వాయిదా తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి సమావేశం కాగా లోక్‌సభలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకరుకు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన వారిలో లగడపాటి, రాజగోపాల్, హర్సకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి ఉన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశమైన ఎంపీలు సొంత పార్టీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానంపై పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 190 నిబంధన కింద వీరు స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.