లోక్ సభ మధ్యహ్నం ఒంటి గంట వరకు వాయిదా
ఢిల్లీ: లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం లోక్ సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులతో తెదేపా ఎంపీలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. తనకు అందిన మూడు అవిశ్వాస తీర్మాన నోటీసులకు స్పీకర్ సభ్యుల మద్దతు కోరారు. అనంతరం సభ మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా పడింది.