నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్ 56 పాయింట్లు నష్టపోయి 20,659 వద్ద , ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 6,154 వద్ద ముగిశాయి. ఇన్ఫోసిస్, సెసా స్టెర్లైట్, టాటా పవర్, యాక్సిన్ బ్యాంక్ షేర్లు లబ్ది పొందగా, జిందాల్ స్టీల్, సన్ ఫార్మా, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ నష్టపోయి వాటిలో ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 61.96 ఉంది.