లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: వారాంత దినమైన శుక్రవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎన్‌ఈ సెన్సెక్స్ 371 పాయింట్లు లాభపడి 21,079 వద్ద ముగిసింది. ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 6,274 వద్ద ముగిసింది. రిలయన్స్, ఓఎన్‌జీసీ, విప్రో, ఎయిర్న్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీలు లాభాలార్జించగా, సన్ ఫార్మా, సెసా స్టెర్లైట్, గ్రాసిమ్, జిందాల్ స్టీల్ తదితర సంస్థలు నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 62.16 ఉంది.