ముస్లిం సంక్షేమానికి పాటుపడేది తెదేపానే : కేశినేని నాని

హైదరాబాద్‌: ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమానికి పాటుపడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తెదేపా నేత కేశినేని నాని అన్నారు. విజయవాడ చిట్టినగర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లింలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ముస్లింలకు కావాల్సిన కనీస సౌకర్యాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ముస్లింల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం సోదరులు చంద్రబాబును ఎన్నుకుని వారి సంక్షేమానికి పూలబాట వేసుకోవాలని కోరారు.