73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీ.వోలను సవరించాలి.

-విడుదల చేసిన 5 జీ.వోలను గెజిట్ చేయాలి .
– సీఐటీయూఆధ్వర్యంలో ఆగస్టు 3 న చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి జి. భాస్కర్
దుబ్బాక 29, జూలై ( జనం సాక్షి )
సిద్దిపేట జిల్లా దుబ్బాక లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 3 న చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ విడుదల చేస్తున్న సీఐటీయూ నాయకులు. అనంతరం సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి జి. భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయనీ, వీటిల్లో సుమారు కోటి  మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారనీ. ప్రతి 5 సం,,రాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి వుంది. కానీ రాష్ట్రం ఏర్పడి 8 సం,,లు గడిచినా టీఆర్ఎస్ భుత్వం కార్మికుల  కనీస వేతనాలు సవరించలేదనీ మండిపడ్డారు. కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్ నెలలో 5 జీ.వోలను విడుదల చేసిన ఆ 5 జీ.వోలను గెజిట్ చేయకుండా కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. మిగిలిన 68 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీ.వోలను సవరించాలని,బీడీ,హహాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్ పోర్టు రంగాల కార్మికలతో పాటు ఇతర కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ రంగంలో సుమారు 16 లక్షలు మంది ఉన్నారనీ. వీరి జి.ఓ.నెం . 25 ను గెజిట్ చేసి వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో సుమారు 20 లక్షల మంది ఉంటారనీ. వెల్ఫేర్ బోర్డులో 14 లక్షల మంది నమోదు చేసుకున్నప్పటికీ 8 లక్షల మంది మాత్రమే రెన్యువల్ చేసుకున్నారు.ప్రభుత్వం కార్మికులందరిని బోర్డులో నమోదు చేయాలనీ, అసెంబ్లీలో ముఖ్యమంత్రి  భవన నిర్మాణ కార్మికులకు లక్ష బైక్ లు ఇస్తామని హామీయిచ్చి నేటికి అమలు చేయలేదనీ విమర్శించారు. లోడింగ్ – అన్లోడింగ్, ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థలో పని చేసే హమాలీ కార్మికులకు 5 లక్షల మందికి ఎలాంటి చట్టపరమైన భద్రత సౌకర్యాలు లేవనీ భవన నిర్మాణ కార్మికుల వలే హహాలీ కార్మికులకు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, వీరికి సమగ్ర శాసనం చేయాలనీ కోరారు.ఉత్తర తెలంగాణలో బీడీ పరిశ్రమ కీలకమని ఎన్నికల సమయంలో కార్మికులకు వాగ్దానాలు ఇచ్చి తరువాత వాటిని ఉల్లంఘించడం పాలకులకు రివాజుగా మారిందనీ, బీడీ రంగంలో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 2012 లో జి.ఓ.నెం . 41 ప్రకారం వేతనాలు పెంచి మళ్ళీ దాన్ని అభియన్స్ లో పెట్టారు. తెలంగాణ  రాష్ట్రం ఏర్పడి 7 సం,, లు గడిచినా జి.ఓ. ను పునరుద్ధరించలేదనీ, బీడీ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికుల వేతనాలు పెంచుతూ జి.ఓ. లు ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలనీ. బీజేపీ మోడీ ప్రభుత్వం హక్కులన్నీ కాలరాస్తున్నదనీ. కేంద్రం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ వ్యతిరేక కోడ్లను  తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడ్లన్నీ యాజమాన్యాల లాభాలు పెంచడానికే దోహాదపడుతాయనీ విమర్శించారు.కార్మిక వర్గం మరింత  శ్రమదోపిడీకి గురికాబోతుందనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో 12 గంటలు పని చట్టబద్దం అవుతుందనీ.కనీస వేతనాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా నిర్ణయిస్తాయనీ తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ ఉండదు. ఫిక్స్డ్ టర్మ్  ఎంప్లాయిమెంట్ పేరిట భద్రత లేని కొలువులు ఉంటాయనీ, కార్మికులను నిరాయుధలను చేసి దోపిడీ చేయడమే ఈ కోడ్ ల లక్ష్యమని ఈ దుర్మార్గమైన నిబంధనలను ఈ కోడ్ల ద్వారా తీసుకువచ్చారనీ మండిపడడారు. కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలనీ. 4 లేబర్ కోడ్లు రద్దుకై,కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2022 ఆగస్టు 3 న ‘ చలో హైదరాబాద్ ‘ సిఐటియు పిలుపునిచ్చిందనీ,కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజయవంతం చేయాన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, నాగరాజు, శ్రీనివాస్, స్వామి, రాజు, భాల్ రాజు, మల్లేశం, పోచయ్య, తదితరలు పాల్గొన్నారు.