శాంతిభద్రంగా ఉంది
లా అండ్ ఆర్డర్‌పైనే కేంద్రంతో చర్చించా
గవర్నర్ నరసింహన్
న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) :
రాష్ట్రంలో శాంతి భద్రంగానే ఉందని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తెలిపారు. శాంతి భద్రతలపైనే తాను కేంద్ర ప్రభుత్వంతో చర్చించానని ఆయన పేర్కొన్నారు. తాను ఏ అధికారిని వెనక్కి పంపలేదని నరసింహన్ చెప్పారు. ఐఏఎస్‌ల బదిలీలు సాదారణ బదిలీలలో భాగమేన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆర్థిక, ¬ంశాఖ మంత్రులతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కేంద్రానికి వివరించినట్లు చెప్పారు. సలహాదారులు ఎవరన్నది కేంద్రమే నిర్ణయిస్తుందన్నారు. లా అండ్ ఆర్డర్‌ను పరిరక్షిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పెట్రో పంపుల సమస్యలను కంపెనీలే పరిష్కరించాలన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని గవర్నర్ హెచ్చరించారు. ప్రధానంగా శాంతి భద్రతలపై కేంద్రనికి వివరించానని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నానని, కిరణ్ నిర్ణయాలను పునఃసమీక్షించడం లేదని చెప్పారు. జలయజ్ఞంలో రూ. 20 వేల కోట్ల కేటాయింపుల ఫైల్‌ను పునఃసమీక్షించేందుకు టైం దొరకలేదన్నారు. వీలైతే ప్రధానిని కూడా కలుస్తానని పేర్కొన్నారు.