సోనియా వల్లే తెలంగాణ సాకారమైంది: జానారెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు మరో 20,30 ఏళ్లు ఉద్యమం చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదికాదని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. సోనియాగాంధీ తీసుకున్న కఠోర నిర్ణయం వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఆమే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మధ్య ఎలాంటి విభేధాలు లేవని స్పష్టం చేశారు.