ఢిల్లీ చేరుకున్న టీపీసీసీ చీఫ్‌ పొన్నాల, ఉత్తమ్‌

జనంసాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా నేడు విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు పలువురు కాంగ్రెస్‌ నేతలు క్యూకట్టారు. దిగ్విజయ్‌తో ఉత్తమ్‌, జానారెడ్డి, వివేక్‌, డీకే అరుణ సమావేశమయ్యారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ ప్రతినిధి జినార్థన్‌ త్రివేది జిబితాను విడుదల చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో 70 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్‌సభ స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.