టి.ఎంపీలు, అధికారులతో కేసీఆర్ సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 7 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ఎంపీలు, అధికారులతో శనివారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రపతి, ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీ, 6:30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు.తెలంగాణకు ప్రత్యేక హోదా, ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, అదనపు విద్యుత్ తదితర అంశాలపై విజ్ఞప్తి చేయనున్నారు.