సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. గత కొద్దిసంవత్సరాల క్రితం మూసివేసిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక నిధులను దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి నమోదు చేసిన కేసులో సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు తన దృష్టిలోకి వచ్చాయని… ఆగస్టు 7 తేదిలోపు నిందితులు కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురికి కూడా నోటీసులు జారీ చేసింది.  భారత మొట్టమొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ ను 2008లో మూసివేశారు.