న‌ల్ల‌ధ‌నం మార్కెటింగ్ వ్యవస్థను నిర్మూలించాలి: మోడీ

ఢిల్లీ: న‌ల్ల‌ధ‌నం మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బ్లాక్‌మార్కెట్ కేసుల త్వరిత విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయలన్నారు. దేశంలో రుతుపవనాల రాక ఆలస్యంపై ఆయన స్పందిస్తూ.. ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. మరో రెండు నెలల్లో పరిస్థితులు మెరుగుపడవచ్చు. దేశంలోని 500 జిల్లాలకు అత్యవసర ప్రణాళిక సిద్ధం చేశాం. కష్ట కాలంలో కేంద్రం, రాష్ర్టాలు కలిసి ముందుకు వెళ్లాలి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ర్టాల మధ్య సమన్వయం, ముందస్తు కార్యాచరణ అవసరమని ఆయన పేర్కొన్నారు.