800 ఎకరాల్లో ముంపునకు గురయిన తమలపాకు తోటలు

విశాఖపట్నం: పాయకరావుపేట మండలంలోని భూమి. ముఠా ఆనకట్లలకు గండ్లు పడ్డాయి. వరద కారణంగా ఇద్దరు మృతి చెందారు. 800 ఎకరాల్లో తమలపాకు తోటలు ముంపునకు గురయ్యాయి. మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఇప్పటి వరకు అధికారులు పర్యటించలేదు. విశాఖ జిల్లా మునగపాక మండలంలోని యాదగిరి పాలెం వద్ద 200 మంది గ్రామస్థులు వరదలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వైమానిక దళ హెలికాప్టర్‌ను అధికారులు సిద్ధం చేశారు.