తాండూర్ మున్సిపల్ లో ఏసీబీ దాడులు
వికారాబాద్ జిల్లా బ్యూరో ఆగస్టు 19 (జనం సాక్షి) : జిల్లాలో అధికారుల అవినీతి శృతి మించింది. ఏసీబీ వరుసగా జిల్లాలో దాడులు నిర్వహిస్తుంది. కలెక్టరేట్లో ఏసీబీ దాడులు మరువక ముందే జిల్లాలో మరొక కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో భాగంగానే తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రమేష్ 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎసిబి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది పూర్తి వివరాలు తెలియవలసి ఉంది