పదవి భాద్యతలు చేపట్టిన చైర్మన్

ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పురపాలక సంఘం లో నూతనంగా ఏర్పడిన పాలక వర్గ మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం 11.00 గంటలకు అర్చకుల సమక్షములో వేద మంత్రాలతో మధ్య పదవి భాద్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమము లో పాలక సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మద్దికట్ల స్రవంతి రమేష్, జంబోజు శ్రీమతి సమ్మయ్య, వేముల లక్ష్మి సమ్మయ్య , యేల్లంకి వంశీధర్, కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, మోహన్ శర్మ, కిషన్ జి, మాజీ జెడ్పిటిసి మూల సరోజన పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీటీసీ వోడ్నాల ప్రవళిక, తోకల మల్లేష్, ఎమ్మెస్ రెడ్డి, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.


