అహంకారానికి అభిమానానికి మధ్య పోటీ కాదు : పిల్లోడి భవాని విశ్వనాథం
సదాశివపేట ఫిబ్రవరి 4
(జనం సాక్షి) : వార్డును సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని పిల్లోడి భవాని విశ్వనాథం అన్నారు. బుధవారం 13వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చేతి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాటలకంటే చేతలకు ప్రాధాన్యతనిస్తూ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా బాధ్యత తీసుకుంటానని అన్నారు. రాజకీయ అనుభవం కలిగిన కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తిగా, అన్ని విధాల అండగా ఉంటాను అని తెలిపారు. అధికార పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజారీతో గెలిపించాలని వార్డులో విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జి విజయభాస్కర్ రెడ్డి, మామిడి రాజు, బొంతపల్లి శ్రీనివాస్, నాగరాజు, అనిల్, యాదగిరి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


