ఆర్టీసీ ఉద్యోగులు విలీనం ప్రభుత్వంలో ఎప్పుడు
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారు ? అపాయింట్‌మెంట్ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన సమాధానాలు ఒకరకంగా చెప్పాలంటే బాధ్యతా రహితంగా, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. జాప్యం జరగడానికి గల కారణాలు ఏంటీ? అన్నప్పుడు లేదండీ అన్నారని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం వచ్చి ఎనిమిదో నెల జరుగుతున్నది. ఇంకా జాప్యం జరుగలేదని చెప్పారు. ఎప్పటిలోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి.. నియమితరోజు ప్రకటించడం అవుతుందా? అంటే పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 28లో ఐటెమ్ నంబర్ 14లో టీఎస్ ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం అని పెట్టారు. ఇందులో ఆర్టీసీ కార్మికులను, ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం అని చెప్పారు. ఎనిమిది నెలల సమయం సరిపోదా?’ అంటూ ప్రశ్నించారు