ప్రతిపక్షనేత హోదాలో నేడు తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్
బీఆర్‌ఎస్ అధినేత ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి వెళ్లలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా తెలిపాయి. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ అసెంబ్లీలో అధికార పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇవాళ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.