డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి

 

 

 

 

 

 

ఆగష్టు 22(జనం సాక్షి)డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్‌, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది. రాఖీ పౌర్ణమికి ముందు రోజు సాత్వికకు జ్వరం రావడం తో స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చూపించగా, టైఫాయిడ్‌ ఉన్నట్టు తేలింది. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాపకు డెంగీ సోకిందని, లివర్‌ దెబ్బతిన్నట్టు తెలిపారు. సాత్విక చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. అలాగే మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన ధర్మారపు బుచ్చిమల్లు, కవిత దం పతుల చిన్న కూతురు ధర్మారపు సాత్విక (9) కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. పలు దవాఖానల్లో వైద్యం చే యించారు. తగ్గకపోవడంతో వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.