కెప్టెన్‌ కోహ్లి కోరితే ఓపెనింగ్‌కు సిద్ధం

బ్యాటిగ్‌ నా ప్రధాన బలం సిడ్నీ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): ఆస్టేల్రియా పర్యటనలో తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అడిగితే తాను ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీమిండియా ఆటగాడు హనుమ విహారి చెప్పాడు. గత ఇంగ్లండ్‌ పర్యటనలో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన విహారి.. ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో అనధికార … వివరాలు

థ్యాంక్యూ ఆంటీ….

హైదరాబాద్‌,నవంబర్‌29 (జ‌నంసాక్షి) : టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులు గత నెలలో మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సానియా తన బాబు ఇజాన్‌పై ఉన్న ప్రేమను, ఇతర విషయాలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తన బిడ్డను చూసేందుకు వచ్చిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ … వివరాలు

కోహ్లకి షాకిచ్చిన నయా బౌలర్‌

వామప్‌ మ్యాచ్‌లో విరాట్‌ వికెట్‌ తీసిన ఆరోన్‌ హర్డీ సిడ్నీ,నవంబర్‌ 29 (జ‌నంసాక్షి) : టీమిండియా కెప్టెన్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రన్‌ మెషీన్‌ పరుగుల దాహానికి అడ్డు లేకుండా పోతున్నది. కీలకమైన ఆస్టేల్రియా టెస్ట్‌ సిరీస్‌ కోసం సిద్ధమవుతున్న విరాట్‌.. అందుకు తగినట్లే వామప్‌ మ్యాచ్‌లో … వివరాలు

టీ ట్వంటీకి వర్షం అడ్డంకి

రద్దయిన రెండో మ్యాచ్‌ మెల్‌బోర్న్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఇండియా, ఆస్టేల్రియా మధ్య జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేద్దామనుకున్న కోహ్లిసేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆస్టేల్రియా ఇన్నింగ్స్‌లో 19 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం మళ్లీ మ్యాచ్‌ను సాగనివ్వలేదు. మధ్యమధ్యలో ఆగుతూ, కురుస్తూ విసిగించింది. మొదట 19 … వివరాలు

చేతులెత్తేసిన టీమిండియా

– మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి – ఫైనల్లోకి దూసుకెళ్లి ఇంగ్లాండ్‌ అంటిగ్వా, నవంబర్‌23(జ‌నంసాక్షి) : మహిళల టీ20 ప్రపంచకప్‌ నుండి టీమిండియా ఇంటిదారి పట్టింది.  టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో శుక్రవారం అంటిగ్వాలో జరిగిన సెవిూఫైనల్‌ మ్యాచులో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట టాస్‌ … వివరాలు

ఆసిస్‌తో తొలి టీ20కి..  భారత్‌ జట్టు ప్రకటన 

– కృనాల్‌ పాండ్య, మనీశ్‌ పాండేలకు దక్కని చోటు బ్రిస్బేన్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియాతో బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం 12మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సెలక్టర్లు రెస్ట్‌ ఇవ్వడంతో ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌కి దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. మళ్లీ తొలి … వివరాలు

అంతర్జాతీయ క్రికెట్‌కు  వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ బ్రావో వీడ్కోలు

– 2004లో అరగ్రేటం చేసిన బ్రావో న్యూఢిల్లీ, అక్టోబర్‌25(జ‌నంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌కు సెలవు ప్రకటించారు. ఇక నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ‘అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా రిటైర్‌ అవుతున్నానని తెలిపాడు. ఈ సందర్భంగ్రా బ్రావో మాట్లాడుతూ.. 14ఏళ్ల క్రితం వెస్టిండీస్‌ తరఫున అరంగేట్రం … వివరాలు

నేడే ఇండియా- వెస్టండీస్‌.. రెండో వన్డే

– వైజాగ్‌ వేదికగా చారిత్రాత్మక మ్యాచ్‌ – 950వ మ్యాచ్‌ ఆడనున్న భారత్‌ విశాఖపట్టణం,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): భారత్‌ – వెస్టండీస్‌ టీంల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ నేడు విశాఖ పట్టణం వేదికగా జరగనుంది.. వెస్టిండీస్‌తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా రెండోవన్డేకు విశాఖ సిద్ధమైంది.   ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్‌ … వివరాలు

కంగారుల భరతం పట్టారు

– ఆస్టేల్రియాను చిత్తుచేసిన పాకిస్థాన్‌ – 373పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన ఆస్టేల్రియా అబుదాబి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : పాక్‌ ఆటగాళ్లు కంగారుల భరతం పట్టారు. ఫలితంగా యూఏఈ వేదికగా ఆస్టేల్రియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్థాన్‌ 1-0తో చేజిక్కించుకుంది. అబుదాబిలో శుక్రవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అత్యద్భుతంగా రాణించిన పాకిస్థాన్‌ … వివరాలు

పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌కు తప్పిన ముప్పు

పీటర్‌ సిడిల్‌ బౌన్సర్‌తో తలకు గాయం దుబాయ్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మైదానంలో బ్యాటింగ్‌ చేస్తుండగా బౌలర్‌ విసిరిన బంతి నేరుగా అతని హెల్మెట్‌కు బలంగా తాకింది. ఐతే గాయాలేవిూ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన అబుదాబిలో ఆస్టేట్రియాతో రెండో టెస్టు మ్యాచ్‌ మూడో రోజులో చోటుచేసుకుంది. … వివరాలు