ఆదిలాబాద్

తుపాకి పేలి కెరమెరి ఎస్‌ఐ మృతి

ఆదిలాబాద్‌: తుపాకి పేలి ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌ఐ శ్రీధర్‌(27) మృతి చెందారు. తుపాకి ప్రమాదవశాత్తూ పేలిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో శ్రీధర్‌ మృతదేహాన్ని గుర్తించిన పని మనిషి పోలీసులకు సమాచారమందించడంతో విషయం వెలుగు చూసింది. 3 నెలల … వివరాలు

బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్ధులు. కుటుంబకలహాలతో ప్రీతమ్‌ను బావ సురేష్ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా బైంసా పట్టణంలోని ఒవైసీ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(12), ముజమిల్‌ ఖురేషీ(9) స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థులు సరదాగా పట్టణ శివారులోని నీటి గుంటల వద్ద ఈతకు వెళ్లారు. రాత్రి వరకు విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు … వివరాలు

అంజయ్యకు నివాళులర్పించిన గద్దర్‌

ఆదిలాబాద్‌: అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్యకు ప్రజా గాయకుడు గద్దర్‌ నివాళులర్పించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని రాగన్నగూడెంలోఅంజయ్య కన్నుమూసిన సంగతి. ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామమైన ఆదిలాబాద్‌ జిల్లా లింగాపూర్‌ తరలించారు. ఈరోజు లింగాపూర్‌ చేరుకున్న గద్దర్‌ అంజయ్య పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అంజయ్య ఆశయాలను కొనసాగిద్దామంటూ అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు.

అడవుల జిల్లాలో మొక్కలు సిద్దం

హరితహారానికి సిద్దంగా శ్రీరాంపూర్‌లో మొక్కలు ఆదిలాబాద్‌, జూన్‌ 20 (జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలో పచ్చదనం కరువై పర్యావరణ సమతుల్యత పెరిగిపోతుందని తత్పలితంగానే వానలు కురవడంలేదని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా మొక్కలను నాటించాలని తలపించింది,. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుం ది. ఇందులో బాగంగా భూగర్బ గనులతో వేడి తీవ్రంగా ఉన్న … వివరాలు

వరదలు ఎదుర్కొనేందుకు సిద్దం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాలు వస్తే వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు యంత్రాంగాన్ని  సిద్ధం చేశారు. ప్రతియేటా కడెం జలాశయం నిండడం,నీరు వృధాగా పోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో జలాశయానికి ఉన్న 18వరద గేట్లకు గ్రీసింగు చేయడం, గేట్లను ఎత్తే యంత్రాల రోప్స్‌కు కార్డింగ్‌కాంపౌడ్‌ పూయడం చేశారు. వరదగేట్లను పరిశీలించారు. అత్యవసర సమయంలో గేట్లను ఎత్తేందుకు ఉపకరించే వంద కె.వి … వివరాలు

అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు రియల్టర్లు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం తిరుగుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. జిల్లాకేంద్రం చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో అనుమతిలేకుండా కొనసాగుతున్న ప్లాట్ల వ్యవహారంపై రెవెన్యూ అధికారులు దృష్టిసారించారు. దీంతో తమను కాపాడాలని రియల్టర్లు మంత్రిని ఆశ్రియంచే పనిలో పడ్డారని సమాచారం. అయితే ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చేందుకు … వివరాలు

హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్‌

ఆదిలాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్‌ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి మల్లేష్‌ అన్నారు. అమరవీరుల త్యాగాలను విస్మరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన దొరతనాన్ని తలపిస్తోందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారిని విస్మరించి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని … వివరాలు

బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం ఒకవైపు … అక్కడే పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బందిని సైతం వదలకుండా వారి జీతభత్యాల్లో కమీషన్లు నోక్కేస్తూ మరోవైపు అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా హోంగార్డుల జీతాల్లో … వివరాలు

ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుంది : కోదండరాం

మంచిర్యాల : ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై స్పందించిన ఆయన జేఏసీలో చర్చించిన తర్వాత సమాధానం చెబుతామని అన్నారు. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం అదిలాబాద్‌ జిల్లాలోని … వివరాలు