తెలంగాణ

జానారెడ్డి ఓటమి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, నాగార్జునా సాగర్‌ ప్రజాకూటమి అభ్యర్థి కె.జానారెడ్డి ఓటమి పాలయ్యారు. జానారెడ్డిపై తెరాస అభ్యర్థి నోముల నర్సింహయ్య ఘన విజయం సాధించారు.

లక్ష దాటిన హరీష్ రావు మెజార్టీ.. 1,06,816

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు.. వరుసగా ఆరోసారి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుగాంచిన సిద్దిపేటలో మరోసారి గులాబీ జెండాను రెపరెపలాండిచారు హరీష్ రావు. హరీష్ రావు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది మొదలు అపజయమన్నదే లేకుండా ఆధిక్యాలు పెంచుకుంటూ పోతున్న ఆయన ఈసారి లక్ష … వివరాలు

 మేం మోసం చేయలేదు: ఎంపీ కవిత

 హైదరాబాద్‌: ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి మోసానికి పాల్పడలేదని అంటున్నారు తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత. ఈరోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో తెరాస ముందంజలో ఉంది. ఈ విషయం గురించి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లాగా తెరాస ఎలాంటి మోసానికి పాల్పడలేదు. గత నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం పాలన చూసే … వివరాలు

ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగింది : ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ స్పందించారు. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఉత్తమ్‌ అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లో స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. కూటమి అభ్యర్థులంతా రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్‌లను లెక్కించే వరకు పట్టుబట్టాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ఎవరు ఓడిపోతారో టీఆర్‌ఎస్‌ నేతలు … వివరాలు

ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం

హైదరాబాద్ : ఎల్లారెడ్డి అసెంబ్లి స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌ గెలుపొందారు.

కొండా సురేఖ ఓటమి

పరకాల: పరకాలలో ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖ ఓటమి పాలయ్యారు. తెరాస అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తెరాస నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ సురేఖ కాంగ్రెస్‌లో చేరి, ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు.

 మేం మోసం చేయలేదు: ఎంపీ

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి చతికిలపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలకు అడ్డుపడ్డ నాగం జనార్ధన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు చుక్కలు చూపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి వస్తున్న మెజార్టీని చూసి.. ఓటమి తప్పదని భావించిన నాగం జనార్ధన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. … వివరాలు

సాయంత్రం 4 గంట‌ల‌కు కేసీఆర్ ప్రెస్ మీట్

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ త‌న జోరు కొన‌సాగిస్తున్న‌ది. 119 స్థానాలకు గాను 91 స్థానాల్లో టీఆర్ఎస్ ప్ర‌స్తుతం ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. దీంతో టీఆర్ఎస్ స్ప‌ష్ట‌మైన ఆధిక్యం దిశ‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు విలేక‌రుల స‌మావేశంలో … వివరాలు

 ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. తాజా ఎన్నికల్లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లోని స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాకూటమి అభ్యర్థులంతా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. … వివరాలు

80వేల ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావు విజయం 

సిద్దిపేట: తెరాస సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దాదాపు 80వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యాన్ని ఆయన సాధించారు.