ఆష్ఘనిస్థాన్‌పై భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం

కొలంబొ: శ్రీలంకలో జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటిల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు 19.2 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత్‌ జట్టులో యువరాజ్‌సింగ్‌ 3, బాలాజీ 3, ఆశ్విన్‌ 2, పఠాన్‌ ఒక వికెట్‌ తీశారు.