ఇరాక్‌లో కారుబాంబు పేలి 21 మంది మృతి

బాగ్దాద్‌ : బాగ్దాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వరసగా కారుబాంబులు పేలి 21 మంది మరణించినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లో, బేకరీ పార్కింగ్‌లో ఇలా మొత్తం 7 చోట్ల బాంబులు పేలాయని గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.